Supreme Court: ‘‘ప్రజల్ని చంద్రుడి పైకి తరలించాలా? మరెక్కడికైనా పంపాలా?’’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషనర్‌పై ఫైర్ అయింది. భారతదేశ జనాభాలో 75 శాతం మంది భూకంపాల జోన్‌లోనే ఉన్నారని, భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది.