Supreme Court: నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం
- అధికార యంత్రాంగాన్ని సంప్రదించండి
- పనికిమాలిన పిటిషన్లు వేయొద్దన్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌ను జాతీయ పుత్రుడిగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ఈ నేపథ్యంలో నేతాజీని ‘‘జాతీయ పుత్రుడిగా’’ ప్రకటించాలని, అలాగే 21 అక్టోబర్ 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపన, 23 జనవరి 1897 ( చంద్రబోస్ జయంతి)లను జాతీయ దినాలుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించింది. ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ.. గతంలోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయని.. అయినా ఇటువంటి విషయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని.. సంబంధిత అధికార యంత్రాంగంతో చర్చించాలని పిటిషన్‌ను కొట్టేసిందని గుర్తుచేశారు. తాజా పిటిషన్ కూడా అలాంటిదేనని కొట్టేశారు.
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని.. తిరిగి ఇదే పిటిషన్ రావడం పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై భవిష్యత్‌లో కూడా ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు దాఖలు చేయొద్దని పిటిషనర్‌కు సీజేఐ గట్టి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి పిటిషన్లు స్వీకరించవద్దని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇప్పుడు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోవాలని.. లేకుంటే ఖర్చులు విధించాల్సి ఉంటుందని పిటిషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.
The Supreme Court has dismissed a public interest litigation seeking a declaration that freedom fighter Netaji Subhash Chandra Bose’s Indian National Army (INA) secured India’s independence, along with a request to declare Netaji as the “National Son” and to observe 21 October… pic.twitter.com/ktYgMeHJFE
— ANI (@ANI) April 20, 2026
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?