Site icon NTV Telugu

Supreme Court: తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు.. సీబీఐ వద్దు సిట్తోనే విచారణ

Sc

Sc

Supreme Court: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎలాంటి జోక్యానికి అర్హమైనది కాదని, దాని పరిశీలనలు ఇతర అధికారుల పనితీరు లేదా ప్రవర్తనపై ఎటువంటి ప్రభావం చూపవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక, సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు, దాని కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని తమిళనాడు సర్కార్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. సిట్ కు ఎంపికైన అధికారులు వేర్వేరు జిల్లాలకు చెందినవారు, దీని వల్ల వారు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టమవుతుంది.. విచారణ సమయంలో సిట్ లోని అధికారులు 200–300 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.

Read Also: IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?

అయితే, వాస్తవానికి సిట్ (SIT) రాష్ట్రానికి అనుకూలంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ సిట్ లేదా సీబీఐ దర్యాప్తును కోరింది.. న్యాయస్థానం మొదట్లో ‘ సీబీఐ లేదు, సిట్‌ను పరిశీలిద్దామని పేర్కొనింది. సిట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలిపింది. ఇక, సిట్ కూర్పును మార్చడానికి తాము అంగీకరించబోమన్నారు. అలాగే, హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) సిట్ కోసం అధికారులను నియమించడానికి “ఇష్టపడటం లేదు” అని హైకోర్టు పేర్కొనడంపై అభ్యంతరంగా ఉందన్నారు. AAG సూచనలను పొందడానికి మాత్రమే సమయం కోరిందని లూథ్రా వాదించారు.

Read Also: Stranger Things : ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?

ఇక, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మేము దీని గురించి ఆలోచించం.. మనం ఏదైనా చెబితే, అది ఒక సమస్యగా మారుతుంది అని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ దశలో విచారణ సిట్‌తోనే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Exit mobile version