Supreme Court: అయోధ్య రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితులు లేవని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం స్పష్టం చేసింది.
సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషనర్
అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, రామమందిర విరాళాల నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందని, అందుకే స్వతంత్ర దర్యాప్తు అవసరమని ఆయన వాదించారు. ఇక, కేసు ఆలస్యమైతే ఎలక్ట్రానిక్ ఆధారాలు చెరిపివేసే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు, మెన్షన్ స్లిప్ సర్క్యులేట్ చేయాలని సూచించింది.
సమ్మర్ వెకేషన్ తర్వాతే విచారణ
అయితే ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితులు లేవని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమైన వెంటనే ఈ కేసును లిస్ట్ చేసి విచారణ చేపడతామని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం ఈ అంశంపై అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.

