NTV Telugu Site icon

Aligarh Muslim University: అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Amu

Amu

Aligarh Muslim University: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈరోజు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడించింది. యూనివర్సిటీ మైనార్టీ హోదా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4: 3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను చట్టం ద్వారా కల్పించారని తెలిపింది. ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967 నాటి సుప్రీంకోర్టు తీర్పును కొట్టిపారేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 30 కింద అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.

Read Also: Game Changer Poster: ‘గేమ్​ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!

కాగా, అలీఘ‌డ్ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనార్టీ హోదా క‌ల్పించే కేసు విచారణలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం నాలుగు ర‌కాల తీర్పుల‌ను వెల్లడించింది. ఈ కేసులో మూడు ర‌కాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మెజారిటీ తీర్పుకు త‌న‌తో పాటు జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రా రాసిన‌ట్లు సీజేఐ తెలిపారు. మరోవైపు, జ‌స్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంక‌ర్ ద‌త్త, జస్టిస్ స‌తీశ్ చంద్ర శర్మలు స‌ప‌రేట్ తీర్పుల‌ను ఇచ్చిన‌ట్లు డీవై చంద్రచూడ్ చెప్పారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 30 కింద అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో 8 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన తీర్పును రిజర్వు న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు ఇచ్చింది.

Show comments