NTV Telugu Site icon

Supreme Court: విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలను జారీ చేసిన సుప్రీంకోర్టు

Sc

Sc

Supreme Court: తన భార్య పెట్టిన వేధింపులు భరించలేక బెంగళూరులో టెక్కీ అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాను రాసిన సూసైడ్‌ నోట్‌ సుప్రీంకోర్టు వరకు చేరాలని అతడు కోరుకున్నాడు. అయితే, ఈ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే, వైవాహిక చట్టాల దుర్వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే విడాకుల సందర్భంగా తీసుకునే భరణం గురించి న్యాయస్థానం విధివిధానాలు వెల్లడించింది. మొత్తం 8 మార్గదర్శాలను సిద్ధం చేసింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ద్విసభ్య ధర్మాసనం.. భరణం కింద ఇచ్చే నగదు గురించి గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా కోర్టులు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Read Also: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి

అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్బంగా ఈ 8 అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి చాలా కీలకమైనవని తెలిపింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని.. అలాగే, నెలకు రూ. 2లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్లు అతుల్ సుభాష్ తన తన సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 8 గైడ్ లైన్స్ జారీ చేయడం గమనార్హం.

Read Also: OCTOPUS Mock Drill: శ్రీశైలం డ్యామ్‌ వద్ద అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్

సుప్రీంకోర్టు జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..

* భార్యాభర్తల యొక్క సామాజిక ఆర్ధిక స్థితిగతులు తెలుసుకోవడం.
* ఫ్యూచర్‌లో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు
* ఇరువురి ఉద్యోగ- విద్యార్హతలు, ఆదాయం-ఆస్తులు తెలుసుకోవాలి.
* ఆదాయం మరియు ఆస్తి సాధనాలు వివరాలు తీసుకోవాలి.
* అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం ఏంటో తెలుసుకోవాలి.
* కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా? అనే విషయాన్ని తెలుసుకోవాలి.
* ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం అందించాలి.
* భర్త ఆర్దిక పరిస్థితి అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలు తీసుకోవాలి.

Show comments