హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు.
అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఎందుకు జాతీయ స్థాయి సమస్యగా మారుస్తున్నారని న్యాయవాది దేవదత్ కామత్‌ను ప్రశ్నించారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తామని, సరైన సమయంలో జోక్యం చేసుకుంటామని ఎన్వీ రమణ చెప్పారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
