దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నరకయాతన పడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. నగర వాసులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంకోవైపు పార్లమెంట్ వేదికగా విపక్ష నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్‌పై మమతను ప్రశ్నించిన బీజేపీ
తాజాగా ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలమయ్యాయంటూ మందలించింది. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ, పెరుగుతున్న వాయు కాలుష్యానికి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలుగా పేర్కొంది. తక్షణమే టోల్ ప్లాజాలను మూసేయాలని ఆదేశించింది. తాత్కాలిక నష్టాలను పౌర సంస్థతో భర్తీ చేసుకోవచ్చని సూచించింది.
ఇది కూడా చదవండి: Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్‌కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!
కాలుష్య నియంత్రణ కోసం తాత్కాలిక లేదా స్వల్ప కాలిక చర్యలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, ఆన్‌లైన్ తరగతులను అనుమతించడంపై సవాళ్లు సహా పిల్లలపై కాలుష్యం ప్రభావంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు.. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇటువంటి చర్యలు తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి ఉద్దేశించిన మధ్యంతర విధాన నిర్ణయాలు అని పేర్కొంది. శీతాకాలంలో పాఠశాలలు 10 నుంచి 15 రోజులు మూసివేయబడతాయని ధర్మాసనం తెలిపింది.
ఇక BS-IV ఉత్తర్వులను సవరించింది. ఏ కారణంతోనైనా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. పాత వాహనాలు కాలుష్య స్థాయిలను మరింత దిగజారుస్తున్నాయని తెలిపారు.
