అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు… దేశవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణను సవాల్ చేసిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీం.. కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణను నియమించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగేశ్వరరావు.. అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్న ఆయన.. అనియంత్రిత అక్రమ నిర్మాణాల వల్ల నగరాల్లో సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.. ఇక, హైదరాబాద్, కేరళలో వరదలతో పలు కాలనీలు మునిగిపోయానని ఈ సందర్భంగా గుర్తు చేసింది సుప్రీంకోర్టు.
Read Also: Congress: కాంగ్రెస్ ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఏర్పాటు.. పీకేపై మౌనం..!