Site icon NTV Telugu

Supreme Court: మైనారిటీ గుర్తింపు.. కేంద్రంపై సుప్రీం అసంతృప్తి

Supreme Court

Supreme Court

మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. తక్కువ జనాభా ఉన్న వర్గాన్ని మైనార్టీలుగా గుర్తించడమా లేదా అన్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే అని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read also: Minister Peddireddy: కక్ష సాధింపు కాదు.. విచారణలో తేలింది

అయితే, మైనారిటీలను నోటిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, రాష్ట్రాలు మరియు ఇతర వాటాదారులతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తన మునుపటి స్టాండ్‌ను రద్దు చేస్తూ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది జస్టిస్‌ ఎస్​కే కౌల్‌, జస్టిస్‌ ఎమ్ఎమ్​సుందరేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్రాలతో 3 నెలల్లోపు సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రానికి అధికారాలు ఉన్నాయని మీరు అంటున్నారు. భిన్నత్వం ఉన్న మనలాంటి దేశంలో, మనం అర్థం చేసుకున్నాం.. కానీ, ఎవరైనా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి ముందు ప్రతిదీ పబ్లిక్ డొమైన్‌లో ఉంది, దాని స్వంత పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరు చెప్పే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Exit mobile version