Supreme court: యూనివర్సిటీల్లో కుల వివక్ష.. యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో పెరిగిన కుల వివక్ష..
- యూనివర్సిటీల్లో స్టూడెంట్స్పై కుల వివక్షను రూపుమాపేందుకు ముసాయిదా సిద్ధం చేయాలి..
- కుల వివక్షను అరికట్టేందుకు యూజీసీ తీసుకున్న కంప్లైంట్స్ వివరాలు ఇవ్వండి: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులపై కుల వివక్షను రూపుమాపేందుకు ముసాయిదాను రెడీ చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి సిద్ధం చేసిన 2012 రూల్స్ ప్రకారం.. ఎన్ని ఈక్వల్ అపార్చునిటీ యూనిట్స్ స్థాపించారో డేటా అందజేయాలని పేర్కొనింది. ఈ సమస్యపై మాకు పూర్తి అవగాహన ఉంది.. దీనిపై ఏదో ఒకటి చేస్తామన్నారు.
Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అలాగే, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు కోరింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు సంబంధించిన కంప్లైంట్స్, తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై 2019లోనే పిటిషన్ దాఖలైందని.. కానీ ఇప్పటి వరకు సరైన విచారణ జరగలేదని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఈ పిటిషన్‌ను క్రమం తప్పకుండా లిస్ట్ చేస్తామని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అయితే, 2004 నుంచి ఐఐటీ, ఇతర విద్యాసంస్థల్లో 50 మందికి పైగా స్టూడెంట్స్ కుల వివక్ష కారణంగా సూసైడ్ లకు పాల్పడ్డారని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారే ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు రోహిత్ వేముల, పాయల్ తాడ్వీల తరపున జైసింగ్ కోర్టులో వాదనలు వినిపించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!