Site icon NTV Telugu

Supreme Court: మమతా బెనర్జీ సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ.. టీచర్ల నియామకాలు రద్దు

Mamatabanerjee

Mamatabanerjee

సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. ఈ ప్రక్రియ అంతా మోసం.. ద్రోహంతో తారుమారు చేయబడిందని అభిప్రాయపడింది. ఈ నియామకానికి విశ్వసనీయత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Farmer Suicide: రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి రైతు ఆత్మహత్య

హైకోర్టు నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ. సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నియామకాలన్నీ మోసపూరితంగా జరిగాయని తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. 2016లో నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం సుప్రీం ధర్మాసనం సవరించింది. అలా జీతం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్పీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

ఇది కూడా చదవండి: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి

Exit mobile version