Supreme Court: వివాహేతర సంబంధాలను రుజువు చేయడానికి ఒక వ్యక్తికి సంబంధించిన హోటల్ వివరాలు, కాల్ డేటాను అడగొచ్చ అనే అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. అయితే ఈ విషయంలో ‘వ్యక్తిగత గోప్యత హక్కు’ను ఉల్లంఘించినట్లు అవుతుందా అన్నదాన్ని సుప్రీం పరిశీలించనుంది. ఈ విషయంలో రాజ్యాంగ ప్రసాదించిన హక్కును సవాల్ చేసిటనట్లు అవుతుందా..? అనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
Read Also: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..
ఈ రకం కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. అతడి భార్యకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి ఒక హోటల్ గదికి సంబంధించిన రిజర్వేషన్, చెల్లింపు, రూం అద్దెకు తీసుకుని ఉన్న వారు సమర్పించిన గుర్తింపు కార్డు వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కుటుంబ న్యాయస్థానం గత డిసెంబర్ 14న ఆదేశించింది.
దీన్ని సవాల్ చేస్తూ.. ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని సదరు వ్యక్తి వాదించాడు. అయితే అతడి వాదల్ని విన్న హైకోర్టు వాటిని తిరస్కరించింది. భర్త వివాహేతర సంబంధాన్ని రుజువుు చేయడానికి ఆధారాలు సేకరించాలని భార్య కోరినప్పుడు స్పందించాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందని తెలిపింది.