NTV Telugu Site icon

Supreme Court: విజయ్ మాల్యాకు బిగ్‌ షాక్.. కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలుశిక్ష

Vijay Mallya

Vijay Mallya

కోర్టు ధిక్కార నేరం కింద పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ 40 మిలియన్ల అమెరికన్ డాలర్లను విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన కేసులో సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 9వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా విదేశాల్లో ఉన్న ‘డియాజియో’ కంపెనీ బ్యాంకు అకౌంట్ నుంచి తన కుమారుడు సిద్ధార్థ మాల్యా, ఇద్దరు కుమార్తెలు లియన్నా మాల్యా, తన్యా మాల్యా అకౌంట్లకు 40 వేల అమెరికన్ డాలర్లు బదలాయించారు. వాస్తవాలను దాచి 40 వేల అమెరికన్ డాలర్లను ట్రాన్స్‌ఫర్ చేశారు.

Read Also: Results: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని పలు బ్యాంకులు ( కన్సార్టియమ్) కోర్టు ధిక్కారం నేరం కింద చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన మొత్తాన్ని తిరిగి డిపాజిట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని బ్యాంకులు కోరాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. విజయ్ మాల్యా తన పిల్లలకు బదిలీ చేసిన 40 బిలియన్ డాలర్ల మొత్తాన్ని నాలుగు మాసాల్లో వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆస్తుల్ని అటాచ్ చేయాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.