Site icon NTV Telugu

Sofiya Qureshi: మంత్రి కున్వర్‌ విజయ్‌షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Sofiyaqureshi

Sofiyaqureshi

కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా? అని ఫైర్ అయింది. మంత్రి వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటుకు ధర్మాసనం ఆదేశించింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. సిట్‌లో ఒక మహిళ ఉండాలని వెల్లడించింది. నివేదిక ఈనెల 28లోపు అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా.. పోలీసులకు కీలక ఆదేశాలు

పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వంలో ఆపరేషన్ జరిగింది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి కున్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో మన సోదరీమణుల సిందూరం తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాక్‌కు పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Yusuf Pathan: దౌత్య బృందంలో యూసఫ్‌ పఠాన్‌.. టీఎంసీ అభ్యంతరం

ఇక మంత్రి వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అనంతరం కేసు నమోదు విషయంలో పోలీసులు సెక్షన్లు నమోదు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక కేసును కోర్టు పరిధిలో పర్యవేక్షించాలని ఆదేశించింది.

Exit mobile version