Site icon NTV Telugu

Bindeshwar Pathak: సులభ్ వ్యవస్థాపకుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని

Sulab

Sulab

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ (CPR) సహాయంతో అతనికి శ్వాసను అందించడానికి ప్రయత్నించారు. అయినా ప్రాణాలు దక్కలేదు.

Read Also: TS Govt: నేటి నుంచే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘డా. బిందేశ్వర్ పాఠక్ జీ మరణం మన దేశానికి తీరని లోటు. అతను సామాజిక పురోగతికి మరియు అణగారిన వర్గాలకు సాధికారత కోసం విస్తృతంగా కృషి చేసిన దార్శనికుడు.” అని ట్విట్టర్ లో తెలిపారు. “బిందేశ్వర్ జీ క్లీన్ ఇండియా నిర్మాణాన్ని తన మిషన్‌గా మార్చుకున్నారు. క్లీన్ ఇండియా మిషన్‌కు ఆయన విపరీతమైన మద్దతును అందించారు. మా వివిధ పరస్పర చర్యల సమయంలో పరిశుభ్రత పట్ల ఆయనకున్న మక్కువ ఎల్లప్పుడూ కనిపిస్తుంది” అని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: Bholaa Shankar: ‘భోళా శంకర్’పై మీమ్స్ వేస్తే గల్లంతే.. ఎందుకో తెలుసా?

బిందేశ్వర్ పాఠక్.. బీహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో జన్మించారు. 1964లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి 1980లో మాస్టర్స్ డిగ్రీని, 1985లో పీహెచ్డీ పూర్తి చేశారు. దేశంలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఆయన 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ను స్థాపించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం పాఠక్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందించింది. అదేవిధంగా పారిశుధ్యం, పరిశుభ్రత రంగంలో ఆక్ష్న చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో 2016లో బిందేశ్వర్ స్వచ్ఛ రైలు మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.

Exit mobile version