NTV Telugu Site icon

Sukesh – Nora Fatehi: డేటింగ్ చేయమని రోజుకి 10 సార్లు ఫోన్ చేసేది.. అవన్నీ అబద్ధాలు

Sukesh On Nora Fatehi

Sukesh On Nora Fatehi

Sukesh Chandrasekhar Makers Sensational Comments On Nora Fatehi: రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేశ్ చంద్రశేఖర్.. తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నటి నోరా ఫతేహిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేటింగ్ చేయమంటూ తనకు రోజుకి 10 సార్లు నోరా ఫోన్ చేసేదని, జాక్వెలిన్ అంటే ఆమెకు అసూయ అని కుండబద్దలు కొట్టాడు. తనపై నోరా చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధమని.. ఆమెకు తాను ఖరీదైన బహుమతులు కొనిచ్చానని బాంబ్ పేల్చాడు. జాక్వెలిన్‌కి వ్యతిరేకంగా తనని ఉసిగొల్పేందుకు నోరా ఎంతో ప్రయత్నించిందని.. తనని చాలా ఇబ్బందులకు గురి చేసిందని అతను పేర్కొన్నాడు.

Venkaiah Naidu: కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలి

సుకేశ్ ఏమన్నాడంటే.. జాక్వెలిన్‌పై నోరా ఎప్పుడూ అసూయ పడేది. తాను జాక్వెలిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు.. ఆమెకి వ్యతిరేకంగా నన్ను ఉసిగొల్పేందుకు ప్రయత్నించింది. జాక్వెలిన్‌ని వదిలేసి, తనతో డేటింగ్ చేయాలని నోరా కోరుకునేది. నాకు రోజుకు కనీసం 10 సార్లు ఫోన్ చేసేది. తాను రెస్పాండ్ అవ్వకపోయినా, తాను కాల్ చేస్తూనే ఉండేది. నా నుంచి కారు గానీ, ఎలాంటి బహుమతులు గానీ తాను తీసుకోలేదని పోలీసులకు నోరా ఇచ్చిన స్టేట్‌మెంట్ పచ్చి అబద్ధం. తనకు కారు కావాలని నోరా నా వెంటపడింది. దీంతో ఆమెకు రేంజ్ రోవర్ కొనివ్వాలని అనుకున్నా. కానీ, ఆ సమయంలో స్టాక్ లేకపోవడంతో.. బీఎండబ్ల్యూ ఎస్ సిరీస్ కొనిచ్చాను. నోరా ఇండియన్ కాకపోవడంతో.. ఆమె స్నేహితురాలి భర్త బాబీ పేరుతో అది రిజిస్టర్ చేశాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Minister Roja: కుప్పంలో చంద్రబాబు దొంగఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు

తనకు, నోరాకి మధ్య ఒక్కసారి మినహాయిస్తే.. మరెప్పుడు ప్రొఫెషనల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదని సుకేశ్ పేర్కొన్నాడు. తన సంబంధిత ఫౌండేషన్ ఒక ఈవెంట్ నిర్వహిస్తే, అందుకు నోరా అటెండ్ అయ్యిందని.. అందుకు గాను ఆ ఫౌండేషన్ ఆమె ఏజెన్సీకి అధికారికంగా పేమెంట్ చేసిందని తెలిపాడు. తాను నోరాని దూరం పెట్టినా.. ఫోన్ చేస్తూ ఇర్రిటేట్ చేసేదని చెప్పాడు. బాబీకి మ్యూజిక్ ప్రొడక్షన్ పెట్టివ్వమని కోరితే, ఆ పని కూడా చేసి పెట్టానన్నాడు. రూ. 2 కోట్లు ఖరీదు చేసే హర్మీస్ బ్యాగ్స్ కూడా ఆమెకి బహుమతిగా ఇచ్చానన్నాడు. అంత చేసినప్పటికీ.. తన దుర్మార్గపు ఆలోచనలతో నోరా తనని దారుణంగా మోసి చేసిందని సుకేశ్ వాపోయాడు. తనకు వ్యతిరేకంగా నోరా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధమని, తమ మధ్య జరిగిన చాటింగ్ స్ర్కీన్‌షాట్స్‌ని ఈడీకి ఇచ్చానన్నాడు.

Kartik Aryan: లాక్‌డౌన్‌లో రోజుకు 2 కోట్లు తీసుకొని.. ఆ పని చేశా

అయితే.. జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని సుకేశ్ పేర్కొన్నాడు. ఆమెను తానెంతో గౌరవిస్తానని.. ఆమె ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమని చెప్పాడు. జాక్వెలిన్ తనతో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందన్నాడు. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో తనకు తెలుసని, జాక్వెలిన్‌ను చూసుకోవడం తన బాధ్యత అని.. ఆమెపై ఉన్న ప్రేమాభిమానాల్ని చాటాడు. ఈ కేసుతో జాక్వెలిన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.