Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bournvita: బోర్న్‌విటా ఇండియాలో తెలియని పిల్లలు, తల్లిదండ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, ప్రస్తుతం బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్’ అనే ట్యాగ్ కోల్పోయింది. దీనిని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్(FSS) చట్టం 2006 లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సమర్పించిన నిబంధనల ప్రకారం.. అసలు ‘హెల్త్ డ్రింక్’ అనే పదాన్ని నిర్వచించలేదని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్‌సిపిసిఆర్ చేసిన దర్యాప్తును అనుసరించి బుధవారం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Hasnuram Ambedkari: “సెంచరీనే నా లక్ష్యం”.. 98 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ పోటీకి సిద్ధం..
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
బోర్న్‌విటాలోని అధిక చక్కెరనే ఆ బ్రాండ్‌కి ప్రతికూలంగా మారింది. గతేడాది ఇన్‌ఫ్లూయెన్సర్ రేవంత్ హిమత్‌సింకా చేసిన ఓ వీడియో వైరల్ అయింది. బోర్న్‌విటా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, ఇది అనుమతించిన దాని కన్నా ఎక్కువ అని ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) నివేదికను హైలెట్ చేస్తూ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ప్యాకేజింగ్, లేబుల్స్‌ని ఉపసంహరించుకోవాలని బోర్న్‌విటాను కోరింది. క్యాడ్‌బరీ బోర్న్‌విటా యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తప్పుడు వాదనల్ని వినిపిస్తోందని, దాని పోషక విలువలు తప్పుగా ఉన్నాయని హిమత్‌సింకా ఆరోపించారు. మొత్తం 100 గ్రాముల బ్యాగులో 50 గ్రాముల చక్కెర ఉందని, బ్యాగ్‌లో సగం చక్కెర మాత్రమే అని చెప్పాడు. దీని తర్వాత గతేడాది డిసెంబర్ నెలలో చక్కెర పరిమాణాన్ని 14.4 శాతం తగ్గించినట్లు మోండెలేజ్ చెప్పింది. 100 గ్రాముల్లో 37.4 గ్రాముల చక్కెరని 32.2 గ్రాములకు తగ్గించింది.
అయితే, బోర్న్‌విటాలో చక్కెర పిల్లలకు సిఫారసు చేసిన రోజూ వారీ చక్కెర కంటే తక్కువగా ఉందని మోండెలెజ్ పేర్కొంది. ఇది అందించబడినప్పుడల్లా దీంట్లో 7.5 గ్రాముల చక్కెర ఉందని, ఇది సుమారుగా ఒకటిన్నర టీస్పూన్లకు సమానమని, ఇది పిల్లలకు రోజూవారీ సిఫారసు చేసిన చక్కెర పరిమితుల కన్నా తక్కువ అని కంపెనీ పేర్కొంది. ఏడు దశాబ్ధాలుగా బోర్న్‌వీటా వినియోగదారుల ప్రేమ, నమ్మకాన్ని పొందిందని, దీనిలో విటమిన్ ఎ, సి, డి, ఐరన్, జింక్, కాపర్ మరియు సెలీనియం అనే పోషకాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయని చెప్పింది.
తాజావార్తలు
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!