NTV Telugu Site icon

Success Story: కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు.. గ్రేట్..

Rajasthan Former

Rajasthan Former

జాబ్ చెయ్యడం వల్ల వచ్చే జీతం సరిపోక చాలా మంది పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మరికొంత మంది రిస్క్ అయిన పర్వాలేదని బిజినెస్ చేస్తున్నారు.. ఇక కొంత మందు వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించేలా లాభాలను అందుకుంటున్నారు.. అందుకే రైతులు గ్రేట్ అంటున్నారు.. దేశాన్ని పాలించే రాజు అనే చెప్పాలి.. తాము పండించిన పంటతో లాభాలను ఆర్జిస్తూ.. సాటి అన్నదాతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం టెర్రకోట వస్తువులు హస్తకళలు అని చెప్పవచ్చు. అందుకనే చాలామంది రాజస్థాన్ లో పచ్చదనం కనిపించదు అని భావిస్తారు.

కానీ ఓ రైతు మాత్రం ఎడారి లో పంటలు పండించి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు..ఆ రైతు ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్న విధంగానే ఆకు కూరలను, కూరగాయలను పండిస్తూ రోజు రూ. 1000 నుంచి 1500 సంపాదిస్తూ లాభాలను పొందుతూన్నాడు..ఈ రైతు పండించిన కూరగాయలను స్థానికులు ఎగబడి మరీ కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఏడారిలో పంటలు పండిస్తున్న రైతు సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాకు చెందిన రైతు పేరు సత్యనారాయణ మాలి. ఇతను తనకున్న ఉన్న అర బిగ భూమిలో పొట్లకాయ, గుమ్మడి, బెండ సాగు చేస్తూ ఏడాదికి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. పచ్చదనంతో ప్రెష్ గా ఉండే ఇతరని కూరగాయలను కొనుగోలు చేయడానికి ప్రజలు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు..అంతేకాదు సేంద్రీయ పద్దతిలో కూరగాయలను పండిస్తారు. అందుకే ఇతని పొలంలో పండే కూరగాయలు భలే రుచిగా ఉంటాయి.. నిత్యం ఇదే పనిలో ఉంటున్నారు ఆ దంపతులు.. అందులోనే సంతోషంగా జీవిస్తూ పది మందికి పని కల్పిస్తున్నారు.. ఒకొక్క రోజు కూరగాయల దిగుబడి బాగుంటే రూ 2000 నుంచి 3000 రూపాయల వరకు కూరగాయలు అమ్ముతూన్నాడు.. నిజంగా ఈ రైతుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. అందరు ఇలా ఆలోచిస్తే ఇక పేదరికం అనే మాట వినిపించదు కదూ..