Site icon NTV Telugu

తుపాకీతో.. ఎస్‌ఐ లైంగిక వేధింపులు

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఎస్‌ఐ.. ఓ బాలికపై తుపాకీతో బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ స్టేషన్ స్పెషల్‌ టీంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సతీష్‌కుమార్‌ ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడి రేషన్‌ దుకాణంలో పనిచేస్తున్న బాలికపై కన్నేశాడు. ఆ బాలికను లొంగదీసుకునేందుకు ఆమె తల్లి, పెద్దమ్మ సహకరించడంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని తుపాకీ గురిపెట్టి బెదిరించాడు. ఆ బాలిక వెంటనే వాట్సాప్‌ ద్వారా పుళల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం వచ్చిన మహిళా పోలీసులు ఆ బాలిక తల్లి, పెద్దమ్మను అదుపులోకి తీసుకోగా, ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

Exit mobile version