Students, Parents Fall Ill After Eating Food: కేరళలో వరసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పతినంతిట్ట జిల్లాలో ఓ చర్చ్ లో బాప్టిజం వేడుకలకు హాజరైన గ్రామస్తులు అక్కడి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత బిర్యానీ తిని ఓ యువతి మరణించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో జరిగిన ఓ ఈవెంట్ లో విద్యార్థులు, తల్లిందండ్రులు ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 6న ఓ పాఠశాల కార్యక్రమంలో ఆహారం తీసుకున్న తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చిన్నారులతో సహా, 7-8 మంది ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Also: WTC Final: ఆస్ట్రేలియాకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు.. రెండో స్థానం ఎవరిది?
ఇదిలా ఉంటే ఫుడ్ పాయిజనింగ్ తో ఇటీవల కేరళలో ఇద్దరు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాసర్ గోడ్ జిల్లా పెరంబాలకు చెందిన అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని తిన్న తర్వాత శనివారం మరణించింది. అయితే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోలేదని ఆహార భద్రతా అధికారులు వెల్లడించారు. యువతి తిన్న ఆహారంలో ఎటువంటి కల్తీ కనుగొనబడలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు కొట్టాయంకు చెందిన రేష్మి అనే నర్సు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయింది. జనవరి 1న పతినంతిట్ట జిల్లా జనవరి 1న కీజ్‌వాయిపూర్ సమీపంలోని చర్చిలో బాప్టిజం సందర్భంగా వడ్డించిన ఆహారాన్ని తిన్న సుమారు 100 మంది అనుమానాస్పద ఫుడ్ పాయిజన్‌తో బాధపడ్డారు.