NTV Telugu Site icon

Bengaluru: ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్

Bengaluru

Bengaluru

బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం సృష్టించింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వాష్‌రూమ్‌లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్‌లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో రికార్డింగ్ వీడియోలు కనిపించాయి. దాదాపు 7-8 వీడియాలు ప్రత్యక్షమయ్యాయి.

ఇది కూడా చదవండి: Anna Sebastian Perayil: పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్.. ఈ నెలలో వివాహం జరగాల్సి ఉంది..

ఈ వార్త కళాశాల అంతటా వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు.. అమ్మాయిల పర్సనల్ లైఫ్‌ను మొబైల్‌లో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసేవాడని ఆరోపించారు. పరిస్థితులు అదుపుతప్పకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడు కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. తోటి విద్యార్థులే అతగాడి మొబైల్‌లో వీడియోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు.. విద్యార్థులను కూడా బెదిరించాడు.

ఇది కూడా చదవండి: Strange Tradition: ఈ ఊళ్లో ఆడవాళ్ళు 5 రోజులు బట్టలు వేసుకోరు.. ఎక్కడో కాదు మన దేశంలోనే

ఇదిలా ఉంటే గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలోని మహిళా టాయిలెట్‌లో కొందరు విద్యార్థినులు రహస్య కెమెరాను గుర్తించడంతో పెద్ద దుమారమే చెలరేగింది. కృష్ణా జిల్లా ఎస్‌ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విద్యార్థుల వాష్‌రూమ్‌లో అలాంటి రహస్య కెమెరాలు ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Nimmala Ramanaidu: వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు మిగలరు..