Earthquake: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూప్రకంపనలతో వణికింది. వరసగా వారం వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో 5.9 తీవ్రతలో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్తాన్, ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. గురువారం రాత్రి 7.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి.
Read Also: Thalapathy Vijay: షాకింగ్.. భార్యకు విజయ్ విడాకులు..?
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలోని ఫైజాబాద్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయి ఉంది. అంతకుముందు ఆదివారం రోజున తెల్లవారుజామున హర్యానా ఝజ్జర్ ప్రాంతంలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ పరిధిలోని భూప్రకంపనలు ఏర్పడ్డాయి. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. నవంబర్ 12న నేపాల్ దేశంలో రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతలో భూకంపం వచ్చింది. ఆ సమయంలో కూడా హిమాలయ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.