Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- నోట్ల కట్టలను ఎత్తుకుపోయిన శునకం
- ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన వింతైన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Steals Cash: మనుషులు దొంగతనం చేయడం విన్నాం.. కోతులు వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఒక కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని నోటకరచుకుని మాయమైన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ వింత దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే.. బిజ్నోర్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త బ్యాంకు నుంచి రూ. లక్ష నగదును విత్‌డ్రా చేసి, వాటిని ఒక నల్లటి సంచిలో పెట్టుకుని, పనిమీద మార్కెట్‌కు వచ్చారు. మార్గమధ్యలో నగరంలోని ఖిలా వాలీ మసీదు వద్ద నమాజ్ చేయడం కోసం ఆగారు. తొందరపాటులోనో లేదా అజాగ్రత్త వల్లనో కానీ, రూ.లక్ష నగదు ఉన్న ఆ సంచిని తన బైక్‌పైనే వదిలేసి మసీదు లోపలికి వెళ్లారు.
ఎంట్రీ ఇచ్చిన కుక్క..
అతను లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడికి ఒక వీధి కుక్క వచ్చింది. బైక్ హ్యాండిల్‌కు వేలాడుతున్న నల్లటి సంచిని చూసి, అందులో ఏదైనా తినే పదార్థం ఉందేమోనని ఆ కుక్క భ్రమపడింది. అంతే.. నేరుగా బైక్ వద్దకు వెళ్లి, ఆ సంచిని నోటితో పట్టుకుని లాగేసింది. వాస్తవానికి ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో, ఆ రూ.లక్ష ఉన్న బ్యాగ్‌తో అక్కడి నుంచి దర్జాగా చెక్కేసింది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన ఆ వ్యాపారికి బైక్ పై డబ్బు సంచి కనిపించకపోయేసరికి గుండె ఆగినంత పనైంది. ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని అనుకొని ఆ పరిసర ప్రాంతాలన్నీ వెతికాడు. కానీ పాపం అతనికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరకు మసీదు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఒక నల్లటి కుక్క వచ్చి ఆ బ్యాగ్‌ను నోటకరచుకుని వెళ్లడం చూసి బాధితుడితో పాటు స్థానికులు కూడా అవాక్కయ్యారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఆధారంగా కుక్క వెళ్లిన దారిలో గాలింపు చేపట్టారు. అయితే ఆ కుక్క ఆ బ్యాగ్‌ను ఎక్కడైనా పడేసిందా? లేక ఎవరైనా దాన్ని తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఖతర్నాక్ కుక్క గానీ, ఆ నగదు సంచి ఆచూకీ గానీ దొరకలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!