దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. పట్టపగలే మనుషులపైకి తెగబడింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఒక వ్యక్తిపైకి అమాంతంగా దాడి చేసి ఈడ్చుకుపోయింది. దీంతో దానితో పోరాడలేక కిందపడిపోయాడు. అనంతరం దాడి చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
ఢిల్లీలోని చత్తర్‌పూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇంతలో ఒక ఎద్దు అతడి దగ్గరకు వచ్చి కొమ్ములతో ఎటాక్ చేసింది. కిందపడేసి కొంత దూరం ఈడ్చుకుని పోయింది. అనంతరం కొమ్ములతో పొడుస్తూనే ఉంది. లేచి వెళ్లేందకు ప్రయత్నించినా అవకాశమే ఇవ్వలేదు. ఇంతలో అతడి అరుపులు విని సమీపంలో ఉన్న మహిళలు బయటకు వచ్చి బెదిరించే ప్రయత్నిస్తే వాళ్లపై కూడా దాడి చేసింది. ఒక మహిళను కొమ్ములతో పొడవడంతో కిందపడిపోయింది. ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఇక స్థానికులు అప్రమత్తమై కర్రలు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ నుంచి పరారైంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన బాలిక మృతి.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
ఇక వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందించారు. రాజధాని నగర రోడ్లపైకి జంతువులు రానివ్వకుండా చూడాలని.. జంతువులతో మనుషులు ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. వీధికుక్కులైనా.. ఎద్దులైనా మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారాయని.. వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇంకొకరు డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలోనే ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఇద్దరిపై ఎద్దు దాడి చేయడంతో 67 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు గాయపడ్డారు. ఇటీవల రాజస్థాన్‌లోని కోటాలో కూడా ఎద్దు దాడి చేయడంతో వృద్ధుడు చనిపోయాడు.
Bull attacks on a Guy who was standing on Road:
https://t.co/9s68f3vwL8— Ghar Ke Kalesh (@gharkekalesh) June 3, 2025
