Site icon NTV Telugu

Gujarat: శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్‌లో ఘటన..

Gujarat

Gujarat

Gujarat: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని మోహసానా జిల్లాలో శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్లు రువ్వడం కలకలం రేపింది. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందు “మోడీ,మోడీ” నినాదాలు.. “ఫ్లయింగ్ కిస్‌”తో సమాధానం..

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రాళ్ల రువ్వుతున్న జనంపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు ఖేరాలు పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని బెలిమ్ వాస్‌లోని హటాడియా ప్రాంతానికి ఊరేగింపు రాగానే రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు మూడు రౌండ్లు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు ఐజీ వీరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. ఘటన తర్వాత ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి 15 మందిని పట్టుకున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఐజీ వెల్లడించారు. ఈ దాడిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, పోలీస్ పెట్రోలింగ్ పెంచినట్లు తెలిపారు.

Exit mobile version