NTV Telugu Site icon

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన.. ఢిల్లీలోని తన ఇంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాడిలో తన ఇంటి కిటికీలు పగిలిపోయాయని ఒవైసీ పోలీసులకు తెలిపారు. దుండగుల రాళ్ల దాడిలో ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి..ఇది తొలిసారి కాదు. నాలుగోసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు మూడుసార్లు దాడి చేశారు. ఇలాంటి దాడులు 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఒవైసీ పోలీసులను కోరారు. అయితే.. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి వేగంగా దర్యాప్తు చేశారు. అయితే అక్కడే సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read also: Mlc Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి నోటీసులు.. ఈనెల 21న విచారణకు హాజరుకావాలి లేదంటే..

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే అసదుద్దీన్ ఒవైసీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంతలోనే ఢిల్లీలోని తన నివాసంపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇలా నాల్గవ సారి జరగడంతో ఎంఐఎం అధినేత సీరియస్‌ అయ్యారు. తన ఇంటిని కొందరు టార్గెట్‌ చేసి మాటి మాటికి ఇలా దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Stalled Wedding: కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?