Site icon NTV Telugu

Ukraine War: రష్యా తరుపున యుద్ధంలో భారతీయులు.. కేంద్రం కీలక సూచనలు..

Ukraine War

Ukraine War

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు పోరాడుతున్నట్లు సమాచారం ఉంది. భారతీయులు బలవంతంగా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్నట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో భారతదేశం శుక్రవారం తన పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులు ‘‘జాగ్రత్తగా వ్యవహరించాలి, వివాదాలకు దూరంగా ఉండండి’’ అని సూచించింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘కొంత మంది భారతీయులు రష్యా సైన్యంలో సహాయక ఉద్యోగాల కోసం పనిచేస్తున్నట్లు మాకు తెలుసు. భారత రాయబార కార్యాలయం వారి కోసం సంబంధిత రష్యన్ అధికారులతో క్రమం తప్పకుండా మాట్లాడుతోంది. భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వివాదాలకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు.

Read Also: Trisha Kidnap Case: టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష!

ముగ్గురు భారతీయులు రష్యా సైన్యంలో పోరాటడానికి బలవంతం చేయబడ్డారని వారిని రక్షించాలని ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని కోరారు. కనీసం ముగ్గురు భారతీయ పౌరులను ఏజెంట్ మోసం చేసి ‘‘ ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్స్’’గా పని చేయడానికి రష్యాకు పంపబడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ముగ్గురు కూడా ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిని రక్షించడానికి , ఇంటికి తీసుకురావడానికి సాయం చేయాలని జైశంకర్‌ని అసదుద్దీన్ కోరారు.

Exit mobile version