Trisha Kidnapped Anchor Pranav to marry him:హైదరాబాద్ లో ఒక టీవీ చానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. యాంకర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు. యాంకర్ ని పెళ్లి చేసుకోవాలని ఆత్రుతతో కిడ్నాప్ పాల్పడ్డ త్రిష ఇప్పుడు పోలీసులకు చిక్కింది. ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ప్రణవ్ తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ అతన్ని రూమ్ లో త్రిష బంధించినట్టు తెలుస్తోంది. ఇక చాలా నరకం అనుభవించి త్రిష చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు ప్రణవ్. ఈ త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ను నడుపుతున్నదని గుర్తించారు. భారత్ మాట్రిమోనిలో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్ట పడ్డ త్రిష పెళ్లి చేసుకుంటే అతనినే వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయింది.
Rakul Preet Marriage Video: రకుల్ ప్రీత్ -జాకీ భగ్నానీ పెళ్లి వీడియో.. సినిమాను మించిపోయిందిగా..
అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే నిజంగా యాంకర్ ప్రణవ్ ఆ ప్రొఫైల్ పెట్టలేదు, ప్రణవ్ పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు అతని పేరుతో డబ్బు సంపాదించే స్కెచ్ వేశారు. ఇక నిజంగానే ప్రణవ్ ఐడి అనుకోని ఇష్టపడ్డ త్రిష పెళ్లి అతన్నే చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్ పై ఇష్టంతో మనసు పడ్డ త్రిష కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్ ఆమె అదుపు నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఐదు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎండిగా ఉన్న త్రిష కోట్లాది రూపాయలకు అధినేత్రి అని తెలుస్తోంది. మొత్తానికి ప్రణవ్ దెబ్బకు కిడ్నాప్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లింది.