NTV Telugu Site icon

Starlink: భారత్‌లో త్వరలో స్టార్‌లింక్..? జియో, ఎయిర్‌టెల్‌పై ఎఫెక్ట్..

Starlink

Starlink

Starlink: భారతదేశంలో ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ ‘‘స్టార్‌లింక్’’ సేవలు త్వరలో ఇండియాలో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఒక వేళ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలోకి వస్తే ముఖేస్ అంబానీ జియో, సునీల్ భారతి మిట్టల్ ఎయిర్‌లెట్ వంటి సంస్థలు జాగ్రత్త పడాల్సిందే.

అయితే, ప్రస్తుతం భారత్‌లో బ్రాడ్ బ్యాండ్, వైఫై ధరలు ప్రపంచంతో పోల్చి చూసినప్పుడు తక్కువ ధరల్ని కలిగి ఉన్నాయి. ఈ ధరలను బట్టి చూస్తే ఎలాన్ మస్క్ జియో, ఎయిర్‌టెల్‌తో పోటీ పడగలడా..? అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్, తన స్టార్‌లింగ్ శాటిలైట్ వ్యవస్థ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాడు.

భూమికి సమీపంలో ఉన్న కక్ష్యలో వేల సంఖ్యలో శాటిలైట్లను మోహరించాడు. వీటి ద్వారా నేరుగా ఇంటర్నెట్ సేవలు అందుకోగలము. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఎడారుల్లో, మహాసముద్రాల్లో, దట్టమైన అడవుల్లో కూడా స్టార్‌లింగ్ ఇంటర్నెట్ సేవల్ని పొందగలం. భారతదేశంలో ఈ సేవల్ని అందించడానికి లైసెన్సుల కోసం అవసరమైన భద్రతాపరమైన అనుమతుల్ని కోరుతున్నట్లు సమాచారం. అధికారులు నిర్దేశించిన షరతులకు అనుగుణంగా అనుమతిని పొందవచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా ఈ రోజు చెప్పారు.

Read Also: PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. 16-21 తేదీల్లో 3 దేశాల్లో టూర్

స్టార్‌లింక్ గత కొన్నేళ్లుగా భారత్‌లోకి రంగ ప్రవేశం చేసేందుకు చూస్తోంది. గత నెలలో న్యూఢిల్లీలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కోసం స్పెక్ట్రమ్ వేలం వేలం వేయబోమని, అయితే దానిని పరిపాలనాపరంగా అందజేస్తామని చెప్పడంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఎలాన్ మస్క్ కోరుకున్నది కూడా ఇదే. మరోవైపు భారతీయ దిగ్గజం బిలియనీర్ ముఖేష్ అంబానీ వేలం వేయాలని కోరుకున్నాడు.

ఈ రోజు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. స్టార్‌లింక్ అవసరమైన భద్రతా క్లియరెన్స్‌ని పొందే ప్రక్రియలో ఉందని, కంపెనీ శాటిలైట్ సిగ్నల్స్‌ని ఎన్‌క్రిప్ట్ చేయడం, 100 శాతం సెక్యూర్‌గా చేసే ప్రక్రియలో ఉందని చెప్పారు. స్టార్‌లింక్ అన్ని సెక్యూరిటీ ప్రక్రియల్ని పూర్తి చేస్తే వారికి లైసెన్స్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ జియోకి 14 మిలియన్ల మంది వైర్డ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. జియోకి దాదాపుగా 500 మిలియన్ల ఇంటన్నెట్ యూజర్లు ఉన్నారు. ఎయిర్‌టెల్‌కి 300 మిలియన్ల బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ స్టార్‌లింక్ వస్తే ఈ రెండు సంస్థలు కూడా తమ కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి.

జియో మొదట కస్టమర్లను పొందేందుకు ఉచిత ఇంటర్నెట్ అందించింది. ఎలాన్ మస్క్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆఫ్రికాలో మస్క్ స్టార్‌లింక్ సేవలకు నెలకు రూ. 10 డాలర్లు (దాదాపుగా రూ.800) మాత్రమే అందిస్తోంది. యూఎస్‌లో మాత్రం నెలకు 120 డాలర్లు (దాదాపుగా రూ.10000) కు అందచేస్తోంది.

Show comments