Site icon NTV Telugu

Kunal Kamra: భార్య లేదుగానీ.. విడాకులు తీసుకున్నట్లుంది.. కునాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు

Kunalkamra

Kunalkamra

కునాల్ కమ్రా.. స్టాండప్ కమెడియన్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యారు. ఇక ఆయనపై మహారాష్ట్రలో పలు కేసులు నమోదయ్యాయి. ముంబైలో కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన హోటల్‌పై కూడా దాడి జరిగింది. ఇక పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా బాంబే హైకోర్టులో కూడా ఊరట లభించింది. ప్రస్తుతం కమ్రా.. పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన గోల్డ్ ధరలు

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం కేసులు, నోటీసులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పోస్ట్ చేశారు. తనకు భార్య లేదు గానీ.. విడాకులు తీసుకున్నట్లు పరిస్థితి ఉందని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. ఈ కేసులను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. ఇక షిండేపై కునాల్ చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర శాసనసభ హక్కుల కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేయాలని నిర్ణయించుకుంది. దీనిపై కూడా స్పందిస్తూ.. ‘‘షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం వారి హక్కు.. జోకులు వేయడం నా హక్కు’’ అని పేర్కొన్నారు. ఇలా కౌంటర్‌కు ప్రతి కౌంటర్ వేస్తూ కమ్రా వార్తల్లో నిలుస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Muralidhar Rao: అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌రావు అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

కునాల్ కమ్రా ముంబైలో జన్మించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నాడు. షిండేపై చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కునాల్ కమ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. అరెస్టు చేయవద్దని ముంబై పోలీసులను ఆదేశించింది.

షిండేను ఉద్దేశించి కమెడియన్ కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే శివసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అనంతరం కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

 

Exit mobile version