Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..
- శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికన్ల అరెస్ట్..
- పట్టుబడిన గార్మిన్ శాటిలైట్ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి సామాను నుంచి గార్మిన్ శాటిలైట్ ఫోన్ దొరికింది. ఎయిర్ పోర్ట్ అధికారులు వీరిని ప్రశ్నించారు, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అమెరికా మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి లగేజీలో ఈ ఫోన్ లభించింది. విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల్లో ఇద్దరు పౌరుల్ని చెక్ చేయగా జీపీఎస్, శాటిలైట్ పరికరాలను కనుగొన్నారు. వీరిని ప్రశ్నించగా, సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్‌లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
జెఫ్రీ స్కాట్ మోంటానా నివాసి. పర్వతాలతో నిండి ఉండే ప్రాంతానికి చెందిన వాడు. అయితే, ఈ ఇద్దరు అమెరికన్ పౌరులు ఏ పని కోసం శ్రీనగర్ వచ్చారనే దానిపై, శాటిలైట్ ఫోన్ ఎందుకుంది అనే దానిపై విచారణ జరుగుతోంది. గతంలో కూడా చాలా మంది విదేశీయులు శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడ్డారు. శాటిలైట్ ఫోన్లపై నిషేధం ఉందని తెలియని విదేశీయులు వీటిని భారత్ తీసుకుని వస్తున్నారు. అయితే, కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా బలగాలు వీటిని తీవ్రంగా పరిగణిస్తాయి.
ఇరిడియం వంటి శాటిలైట్ ఫోన్లపై భారత్‌లో నిషేధం ఉంది. ఇలాంటివి తీసుకువస్తే ముందుగా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్‌లో ముందుగానే తెలియజేయాలి. ఇదే కాకుండా DoT లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా, ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం, శాటిలైట్ ఫోన్ లేదా శాటిలైట్ GPS పరికరాన్ని కలిగి ఉండటానికి అనుమతి తీసుకోకపోతే, దానిని కూడా నేరంగా పరిగణించవచ్చు.
- Tags
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!