NTV Telugu Site icon

Split in BKU: రెండుగా చీలిన బీకేయూ.. కొత్త యూనియన్‌ ఆవిర్భావం..

Bku

Bku

రైతుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసి.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ)లో చీలిక వచ్చింది. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన రాకేష్‌ టికాయత్ వైఖరి నచ్చని రైతు నాయకులు కొత్త సంఘం పెట్టుకున్నారు. రాజేష్‌ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ అరాజనీతిక్ పేరుతో కొత్త సంఘంగా ఆవిర్భవించింది. రాజకీయాలకు వ్యతిరేకంగా రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు రాజేష్‌ సింగ్ చౌహాన్. ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రముఖ నేతలుగా ఎదిగిన రాకేష్‌ టికాయత్, నరేష్ టికాయత్ సోదరుల వ్యవహారం తమకు నచ్చలేదన్నారు.

Read Also: CBI Raids: చిదంబరం ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు

ఇక, రాజేష్‌ సింగ్ చౌహాన్ కొత్త యూనియన్ ప్రకటించిన వెంటనే… చౌహాన్ సహా ఏడుగురిని BKU నుంచి బహిష్కరిస్తున్నట్టు రాకేష్ టికాయత్ ట్వీట్ చేశారు. వారు రైతు వ్యతిరేకులని ఆరోపించారు. అయితే, యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్ర సింగ్‌ టికాయిత్‌ వర్ధంతి రోజునే బీకేయూ చీలిపోవడం చర్చగా మారింది.. ఇక, రైతు సంఘాల చీలిక వెనుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఉందని ఆరోపించారు రాకేష్‌ టికాయిత్‌. ఏదేమైనా.. తమ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలనే వెనక్కి తీసుకునేలా చేసిన బీకేయూ.. ఇలా చీలిపోవడం.. పోరాట స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నేతలు.