NTV Telugu Site icon

Akhilesh Yadav: లక్నోలో ఉద్రిక్తత.. జేపీఎన్‌ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ నేతల ఆందోళన..

Up

Up

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో ఉద్రిక్తత కొనసాగుతుంది. నగరంలోని జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (జేపీఎన్‌ఐసీ) దగ్గర సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేస్తున్నారు. జయ ప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ నిరసనకు దిగారు.

Read Also: Vishwambhara : వాయిదాకు నో అన్న మెగాస్టార్.. సంక్రాంతి బరిలోనే విశ్వంభర

ఇక, ఈరోజు (శుక్రవారం) జయప్రకాష్‌ నారాయణ్‌ జయంతి సందర్భంగా గురువారం రాత్రి ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌ గేట్‌ దగ్గర పోలీసులు రెండు అడ్డు తెరలు ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో దాచడానికి ట్రై చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఎస్పీ పార్టీకి చెందిన శ్రేణులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జేపీఎన్‌ఐసీకి వెళ్లేదారిలో ఈరోజు (శుక్రవారం) పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు సైతం విధించారు. సెంటర్‌ మెయిన్‌ గేట్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెంటర్‌ పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు పహారా కాస్తుంది.

Show comments