Site icon NTV Telugu

Udhayanidhi Stalin: బాలీవుడ్పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్

Stalin

Stalin

Udhayanidhi Stalin: బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరాఠీ, బోజ్‌పురి, బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారు అని మండిపడ్డారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవన్నారు. ఒక వేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో ఫెయిల్ అయితే.. ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశం ఉందన్నారు. అయితే, హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని.. దాన్ని తమపై బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ద్రవిడ ఉద్యమాలన్నారు. ఈ మేరకు మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో ఉదయనిధి స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు.

Read Also: Allu Arjun : బన్నీ – శ్రీలీల స్పెషల్ సాంగ్ క్రేజి అప్డేట్..

అయితే, జాతీయవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి లాంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా వినియోగించారని డిప్యూటీ సీఎం ఉదయనిధి పేర్కొన్నారు. తద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని చెప్పుకొచ్చారు. సంస్కృతి, భాషాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమం.. 1930ల్లో, 1960ల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు కొందరు ‘జాతీయవాదులు’ ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా భారతీయ జనతా పార్టీపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.

Exit mobile version