NTV Telugu Site icon

Emergency: “ఎమర్జెన్సీ” ప్రకటన సమయంలో సోనియాగాంధీ అక్కడే ఉన్నారు..

Sonia Gandhi

Sonia Gandhi

Emergency: జూన్ 25, 1975 ఎమర్జెన్సీ విధించిన రోజును భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొంటారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేటిలో ఎమర్జెన్సీ విధింపుకు నేటిలో 50 ఏళ్లు గడిచాయి. ఇదిలా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయడాన్ని బీజేపీ నేత విమర్శించారు. మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ఎమర్జె్న్సీ విధించాలని నిర్ణయం తీసుకున్న రోజు, సోనియా గాంధీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉన్నారని అన్నారు.

Read Also: Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం

ఎమర్జెన్సీ సమయంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మిసా) కింద జైలుకెళ్లిన వ్యక్తులను సన్మానించేందుకు బీజేపీ ఎంపీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ 100 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని, ఇప్పుడు బూటకపు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని మిశ్రా మండిపడ్డారు. ఇండియా కూటమి నేతలు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పుకుంటున్నారనీ, కానీ నిజానికి వారు తమ పిల్లల రాజకీయ భవిష్యత్తును రక్షిస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను చూడని వారి కోసం ఎమర్జెన్సీ నిజాలు చెప్పేందుకు బీజేపీ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.