Sonia Gandhi: కాంగ్రెస్ ఒక పార్టీ మాత్రమే కాదు.. చెక్కు చెదరని ఉద్యమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi Speech In Mallikarjun Kharge Oath Ceremony: తమ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. ఓ చెక్కు చెదరని ఉద్యమంలా ఏళ్ల తరబడి నిలిచిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె.. కాంగ్రెస్ ఎన్నో సవాళ్లను, ప్రమాదాలను ఎదుర్కొందని.. కానీ, ఏనాడూ ఓటమిని అంగీకరించలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా విజయం సాధిస్తామని నమ్మకం వెలిబుచ్చారు. పార్టీ ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయని.. ఈ సవాళ్లను తాము పూర్తి శక్తిసామర్థ్యాలతో, ఐకమత్యంతో ఎదుర్కొంటామని వెల్లడించారు. అందరం కలిసి తమ లక్ష్యాలను సాధిస్తామని జోష్ నింపారు.
ఇక ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు సోనియా గాంధీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చాలా అనుభవజ్ఞుడైన నాయకుడని, స్వయంకృషితో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారని, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడు తాను ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో.. కొంత ఉపశమనం లభించిందని, మార్పు ప్రకృతి ధర్మమని అన్నారు. పార్టీ కోసం తాను పూర్తి స్థాయిలో పని చేశానని, ఈరోజుతో తనకు బాధ్యతల నుంచి విముక్తి కలగడంతో తన భుజాల మీద ఎంతో బరువు తొలగిపోయినట్టుగా ఉందని పేర్కొన్నారు. ఇన్నేళ్లు తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్ష ఎన్నికను సజావుగా నిర్వహించినందుకు మధుసూదన్ మిస్త్రీకి ధన్యవాదాలు చెప్పారు.
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే పోటీ చేయగా.. భారీ మెజారిటీతో ఖర్గే విజయం సాధించారు. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్లందరూ ఖర్గేకి మద్దతు తెలపడంతో, ఈ ఎన్నికల్లో ఆయన సునాయాసంగా గెలుపొందారు. అయితే.. గాంధీలకు విదేయుడిగా ఉన్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖర్గే గెలిచాడన్న విమర్శలు వచ్చాయి. ఏదేమైనా.. దాదాపు 23 ఏళ్ల తర్వాత గాంధీయేతరులు కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టారు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!