NTV Telugu Site icon

PM Modi: సోనియా గాంధీ రాయ్‌బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..

Pm Modi

Pm Modi

PM Modi: సోనియాగాంధీ టార్గెట్‌గా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్‌బరేలీని వదిలేసి, తన కొడుకు రాహుల్ గాంధీ కోసం సోనియాగాంధీ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. కుటుంబ ఆధారిత పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ ప్రచారానికి వెళ్లి, తన కొడుకును వారికి అప్పగిస్తున్నానని చెబుతున్నారని, రాయ్‌బరేలీలో ఎక్కువ కాలం పార్టీ తరుపున పనిచేసిన ఒక్క కార్యకర్త కనిపించలేదా..? అని ప్రధాని ప్రశ్నించారు.

సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గాన్ని సందర్శించలేదని, ఇప్పుడు తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. వారు రాయ్‌బరేలీని కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. శనివారం రాయ్‌బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సోనియాగాంధీ, తన కుమారుడు(రాహుల్ గాంధీ)ని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, అతడు మిమ్మల్ని నిరాశపరచడని ఆమె అన్నారు.

Read Also: Janhvi Kapoor: 13 ఏళ్లకే పోర్న్ సైట్లో ఫోటోలు… నా ఫ్రెండ్స్ కూడా చూశారు… జాన్వీ కపూర్ ఎమోషనల్

మరోవైపు రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుంచి రాయ్‌బరేలీకి పారిపోయాడని, ఇది తన తల్లి సీటు అని అందరికీ చెబుతూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘‘8 ఏళ్ల పిల్లాడు చదువుకోవడానికి బడికి వెళ్లినప్పుడు కూడా తన నాన్న చదివిన బడి అయినప్పటికీ ఇది మా నాన్న బడి అని చెప్పడని, కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాన్ని తన పూర్వీకుల ఆస్తిగా భావిస్తోంది. జార్ఖండ్ అలాంటి కుటుంబ ఆధారిత పార్టీల నుంచి రక్షించబడింది’’అని ప్రధాని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడతలో ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలకు మే 20న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈ స్థానాలను మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి రాయ్‌బరేలీకి ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.