Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..

  • నవంబర్ 10న సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదల..
  • రాజీవ్ ప్రధాని కావడం తనకు ఇష్టం లేదన్న సోనియా..
  • విడుదలకు ముందే సంచలంగా మారిన ‘‘బిలాంగింగ్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్’’
Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi:  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆత్మకథ ‘‘బిలాంగింగ్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్’’ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే ఈ పుస్తకం సంచలనంగా మారింది. మంగళవారం సోనియా గాంధీ తన ఆత్మకథ పుస్తకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజీవ్ గాంధీ ప్రధాని కావడాన్ని తాను మొదట వ్యతిరేకించానని చెప్పారు. ఈ పుస్తకం వెలువడిన తర్వాత కొందరి అభిప్రాయాలు మారవచ్చని, మరికొందరికి తనపై ఉన్న అభిప్రాయం మరింత ప్రతికూలంగా మారవచ్చని సోనియా అన్నారు. మంగళవారం విడుదల చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని, తన కోణంలో ప్రజలకు వివరించే అవకాశం ఈ పుస్తకం ద్వారా లభించిందని అన్నారు.

తమాషా తప్పదు..

తన ఆత్మకథపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉందో సోనియా ముందుగానే ఊహించారు. ‘‘తన గురించి కొంత మంది అభిప్రాయాలు మారొచ్చు. కొందరికి తనపై ఉన్న అభిప్రాయం మరింత దిగజారొచ్చు. పుస్తకం రాసినప్పుడు లేదా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటివి సహజమే. కొంత తమాషా జరగడం తప్పదు’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఈ పుస్తకంలో వ్యక్తిగత, రాజకీయంగా సున్నితమైన అంశాలు చర్చించారనే సంకేతాలు ఇచ్చారు.

నవంబర్ 10న విడుదల..

సోనియా గాంధీ బయోగ్రఫీ నవంబర్ 10న విడుదల కానుంది. ఇందులో నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధించిన కీలక సంఘటనలు ఉన్నాయి. ఈ తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. 544 పేజీల ఈ పుస్తకంలో ఇటలీలో ఆమె బాల్యం, 1965లో కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో ఆమె తొలి భేటీ, ఆమె వివాహం, ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీల హత్యలు, ఆమె రాజకీయ ప్రవేశం, 2004లో ప్రధానమంత్రి పదవిని అంగీకరించకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం వంటి అంశాలు ఉన్నాయి. హార్పర్‌కాలిన్స్ ఈ పుస్తకం యొక్క భారతీయ ఎడిషన్‌ను ప్రచురిస్తుంది.