అధినేత్రి నుంచి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు. అంతేకాదు.. ఈ ఏడాది చివరి నాటికి 75 శాతం మంది ప్రజలకు టీకాలు అందించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అప్పుడే కరోనా ముప్పును అధిగమించగలమన్నారు సోనియా గాంధీ.
మూడో వేవ్ ముంచుకొస్తుందన్న హెచ్చరికలపైనా ఆమె స్పందించారు. మూడోవేవ్‌కు దేశం సిద్ధంగా ఉండాలని చెప్పారు. సెకండ్ వేవ్ విలయం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మూడో వేవ్ ముప్పు నుంచి చిన్నారులను మినహాయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం చేయాలని నాయకులకు సోనియా గాంధీ సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రైతులు, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోందని చెప్పారు. దీనిపై నిరంతరం ఆందోళనలు చేపట్టాలని అన్నారు. దీంతో పాటు నిత్యవసర ధరలు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు సోనియా గాంధీ. ఇక కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేయాలని నాయకులకు చెప్పారు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!