Site icon NTV Telugu

Congress Party: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. కరోనా సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈనెల 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని గడువు కోరారు. ఈ మేరకు జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆమె కుమారుడు రాహుల్ గాంధీని కూడా జూన్ 13న ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపించింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జూన్ 13న హాజరు కావాలని ఫెడరల్ ఏజెన్సీ రాహుల్ గాంధీని కోరింది.

Exit mobile version