Site icon NTV Telugu

Sonam Raghuvanshi Case: ‘‘ఈ కేసు సమాజానికి గుణపాఠం’’.. హనీమూన్ మర్డర్‌పై సీఎం మోహన్ యాదవ్..

Sonam Raghuvanshi Case

Sonam Raghuvanshi Case

Sonam Raghuvanshi Case: రాజా రఘువంశీ హత్య, భార్య సోనమ్ రఘువంశీ దుర్మార్గం యావత్ దేశంలో సంచలనంగా మారింది. కొత్తగా పెళ్లయని జంట హనీమూన్‌కి వెళ్లింది. అక్కడే కిరాయి హంతకులతో సోనమ్ రాజాను దారుణంగా హత్య చేయించింది. పెళ్లయిన రెండు వారాల వ్యవధిలోనే భర్తను ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం కడతేర్చింది.

ఇండోర్‌కి చెందిన యువ వ్యాపారవేత్త మరణంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇలాంటి కేసుల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఈ కారణాల వల్లే పాత రోజుల్లో పెళ్లి తర్వాత కొత్త వధూవరులను తమ జిల్లా దాటి పంపించడానికి బంధువులు భయపడేవారు. అసలు పంపించేవారు కాదు.’’ అని ఆయన అన్నారు.

Read Also: Sonam Raghuvanshi: సోనమ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లవ్ ఎఫైర్ గురించి ముందే తెలుసు..

ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ రఘువంశీ కేసుపై మాట్లాడుతూ.. ‘‘పిల్లల వివాహం చేసేటప్పుడు కుటుంబాలు విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి. పిల్లపై నిఘా ఉంచాలి. వివాహం తర్వాత నూతన వధూవరుల్ని వేల కిలోమీటర్ల పంపడం ఏ విధంగా సముచితంగా ఉండదు. ఇలాంటి సంఘటనల్ని ప్రోత్సహించేవారిని తాను ప్రశ్నించడం లేదు కానీ, ఖచ్చితంగా రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ కేసు తెలియజేస్తుంది’’ అని ఆయన అన్నారు. ఈ సంఘటన వల్ల తాను చాలా బాధపడ్డానని, మనమందరం దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.

Exit mobile version