PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు. ప్రస్తుతం మనం 2024వ ఏడాదిని పూర్తి చేసుకోబోతున్నాం.. 2025 కోసం దేశం మొత్తం సిద్ధమవుతోందన్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్ ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైంది.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నామని పేర్కొన్నారు. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Prashant Kishor: బీహార్ చాలా దారుణమైన స్థితిలో ఉంది.. అది ఒక విఫల రాష్ట్రం..
ఇక, ఈ పార్లమెంట్ సమావేశాల్లో సరైన చర్చ జరగాలని ప్రధాని మోడీ తెలిపారు. అయితే, కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాళ్లను కాలమే శిక్షిస్తుంది.. ప్రజలు 80- 90 సార్లు తిరస్కరించిన కూడా వారు సభను సజావుగా సాగనివ్వరు అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. అందుకే ప్రజలు వాళ్లను ప్రతిసారీ తిరస్కరిస్తున్నారు.. కొందరు సరే అంటున్నారు.. మరి కొందరు మొండికేస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.