Site icon NTV Telugu

JK Encounter: ఉగ్రవాదులపై వేట.. ఒక జవాను వీరమరణం

Jkencounter

Jkencounter

జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చత్రోలోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు.

ఇది కూడా చదవండి: Plane Crash: శాన్ డియాగోలో కూలిన విమానం.. ఆరుగురు మృతి

చత్రో ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు దాక్కుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ తీవ్ర ఎన్‌కౌంటర్‌గా మారింది. మొదటి రోజు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే మిగిలిన ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లో దాక్కున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రెండో రోజు కూడా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో సెపాయ్ గాయ్కర్ సందీప్ పాండురంగ్ అనే జవాన్ వీరమరణం పొందారు. ఆయన త్యాగానికి గుర్తింపుగా జమ్మూ కశ్మీర్‌లో రీత్ లేయింగ్ సెరిమనీ నిర్వహించారు. ఇక ఉగ్రవాదులు దాక్కున్న స్థలాలను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ఇక ఉగ్రవాదులు ఎన్‌క్రిప్టెడ్ సమాచార పరికరాలను వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఈ ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో సెర్చ్ ఆపరేషన్‌ను మరింత తీవ్రతరం చేశారు.

Exit mobile version