ప్రీవెడ్డింగ్ షూట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న వధువరుల మధ్యలో అనుకోని అతిథి పలకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కాలంలో వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెళ్లి అనగానే వధువరులు ప్రీ వెడ్డింగ్ షూట్‌కు రెడీ అవుతున్నారు. అంత్యంత అందమైన, ఆకర్షణీయమైన స్థలాలను కోసం దేశం మొత్తం జల్లడపట్టేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కాస్తా వైవిధ్యత కోరుకుంటున్నారు వధువరులు. అందుకే డిఫరెంట్‌గా ట్రే చేస్తున్నారు.
ఈ క్రమంలో నదిలో అదికూడా రాత్రి ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకున్న ఓ జంట షాకింగ్ సంఘటన ఎదురైంది. నదిలో వధువరులు కూర్చుని ఉండగా.. చూట్టు ఫోటోగ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. ఫొటోలకు ప్రత్యేక ఆకర్షణ ఇచ్చేందుకు వారి చూట్టు పక్కల పొగలాంటి పదార్థం చల్లుతున్నారు. ఫొటోగ్రాఫర్లు షూట్‌పై నిమగ్నమయ్యారు.. ఆ జంట ఫోజులు ఇచ్చే పనిలో పడింది. ఈ క్రమంలో వారి దగ్గరి సడెన్ పాము వచ్చింది. నీటిలో పాకుతూ ఫొటో గ్రాఫర్ మీదకు వచ్చిన ఆ పాము ఆ తర్వాత వధువరుల వైపు వెళ్లింది. వారు అరుస్తుంటే భయపడ్డ ఆ పాము ఆ జంట మధ్యలోకి వెళ్లింది. కాసేపు అటూ ఇటూ తిరుగుతూ చివరకు వధువు మీద నుంచి పాకుతూ వెళ్లడంతో కాసేపు అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది.
Also Read: Kakatiya University: కేయూలో ర్యాగింగ్ కలకలం.. మహిళా హాస్టళ్లలో జూనియర్లకు వేధింపులు.. 81 మందిపై వేటు
పాముపైకి రావడంతో కదలకుండ స్తంభించిపోయిన వధువు ఆ తర్వాత ఏడుపు మొదలు పెట్టింది. దీంతో వరుడు ఆమెను ఓదార్చాడు. అలా వైవిధ్యత కోసం రాత్రి నదిలో ఫొటో షూట్‌కు వెళ్లిన వారికి పాము షాకిచ్చింది. అయితే అది ఎవరిని ఏం అనకుండ సైలెంట్‌గా వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ వీడియోను parshu_kotame_photography150 అనే ఫొటో గ్రాఫర్ షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీ అని కామెంట్స్ చేస్తుంటే మరికొంద పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. అదే ఏ నాగుపాము, విష సర్పం అయ్యింటే ఎంతటి ప్రమాదం.. టైం గాడ్ ఆ వధువు పెద్ద ప్రమాదం తప్పించుకుంది’ అంటూ వారిపై కన్‌సర్న్ చూపిస్తున్నారు.