Site icon NTV Telugu

Smriti Irani: రాహుల్ గాంధీ “ప్రేమ” వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఆగ్రహం..

Smriti Irani

Smriti Irani

Smriti Irani: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘ మొహబ్బత్ కీ దుకాన్’పై ప్రేమ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రేమ ఉంటే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ఎందుకు బహిష్కరించారని ఆమె ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోయడం, బొగ్గు దోచుకోవడం, దేశాన్ని తిట్టినవారితో కరచాలనం, కౌగిలించుకోవడం, కేరళ స్టోరీ వస్తే మట్లాడకపోవడం, సెంగోల్ ని అవమానించడం అసలు ప్రేమ ఎలా అవుతుందని..? అని ప్రశ్నించారు.

Read Also: Aata Sundeep: పెళ్లి తరువాత లవ్ ఎఫైర్.. నా భార్యే దగ్గర ఉండి ముద్దు పెట్టించింది

విదేశాల్లో రాహుల్ గాంధీ భారతదేశ పరువు తీస్తున్నారని, ఇలాంటిది ప్రేమ ఎలా అవుతుందని ఆమె అడిగారు. మీడియా సమావేశంలో ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన, ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆమె మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు రక్షణగా ఉందని అన్నారు. బీజేపీ ముస్లిం వ్యతిరేఖ పార్టీనా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రతీ తరగతికి, ప్రతీ వర్గానికి అవసరాలు అందేలా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ముస్లిం సమాజానికి తాము రక్షకులమని చెప్పుకునే గాంధీ కుటుంబం కేవలం రూ. 12,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మోడీ ప్రభుత్వం రూ.31,450 కోట్ల బడ్జెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు.

భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నాయకత్వం బయటి శక్తులను ఉపయోగిస్తోందని, అధికార దాహంతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడుతూ, బీహార్‌లో వంతెన కొట్టుకుపోయినట్లుగా ప్రతిపక్షాల కోరికలు కూడా తుడిచిపెట్టుకుపోతాయని ఆమె అన్నారు.

Exit mobile version