Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో సోమవారం నాడు సాయంత్రం ఘోర విషయం చోటు చేసుకుంది. స్థానిక టీ తోటలో అస్సాం నుంచి వలస వచ్చి కూలీలుగా పని చేస్తున్న దంపతుల కుమారుడు నూర్-ఉల్-హక్ పాలు తీసుకురావడానికి సమీపంలోని ఇంటికి వెళ్లాగా.. ఆ సమయంలో దారి తప్పి వచ్చిన ఒక స్లోత్ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. ఇక, ఆ బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అనేక చోట్ల వెతికారు. అయితే, మార్గమధ్యంలో చిందర వందరగా పాలు, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో టీ తోట కార్మికులు గాలించగా.. కొద్దీ దూరంలో నూర్-ఉల్-హక్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక, బాలుడి ఒక కన్ను, ముఖంలోని ఒక భాగం, మెదడులోని కొంతభాగాన్ని ఎలుగుబంటి తిన్నట్లు అధికారులు గుర్తించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాడంపారై పోలీసులు, అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
Read Also: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
అయితే, ఇదే ప్రాంతంలో గత ఆరు నెలల్లో ఇది రెండో దారుణ ఘటన. జూన్ మాసంలో పాచమలై ఎస్టేట్ సమీపంలోని కలియమ్మాల్ నివాస ప్రాంతంలో జార్ఖండ్ నుంచి వలస వచ్చిన దంపతులకు చెందిన నలుగురేళ్ల రోషిని కుమారి ఆడుకుంటూ ఉండగా చిరుతపులి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనపై పోలీసులు, అటవీ అధికారులు కలిసి రోషిని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ చిన్నారి శరీర భాగాలు అక్కడక్కడా చిందర వందరగా పడ్డాయని చెప్పారు. ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.