Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..

  • సియా ‘‘మిడిల్ ఫింగర్’’ చూపించలేదు..
  • ఆమె వేళ్లు కారు డోర్‌లో ఇరుక్కుని గాయమైంది..
  • కేతన్ హత్య నిందితురాలి తండ్రి వివరణ..
Ketan Murder Case

Ketan Murder Case

Ketan Agarwal murder: కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్‌కు సంబంధించి ఇటీవల ఒక ఫోటో వైరల్‌గా మారింది. మీడియాకు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె వ్యవహారంపై నెటిజన్లతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఫోటోపై సియా తండ్రి ప్రవీణ్ గోయల్ వివరణ ఇచ్చారు. తన కూతురు మధ్యవేలు చూపించలేదని వెల్లడించారు.

లీసులు సియాను ధృవీకరణ కోసం ఇంటికి తీసుకువచ్చిన రోజు, ఆమె రెండు వేళ్లు కారు డోర్‌లో ఇరుక్కుపోయాయని ఆయన చెప్పారు. ఆ ప్రమాదం కారణంగా ఆమె వేళ్లు వాచిపోయాయని, గోళ్లు నీలి రంగులోకి మారాయని ఆయన తెలిపారు. కెమెరాలతో చిత్రీకరించే సమయంలో సియా వేలు పైకి ఉందని దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. తన వాదనలు నమ్మకపోతే సంఘటనా స్థలంలో ఉన్న పోలీసుల నుంచి సమాచారం తీసుకోవచ్చని ప్రవీణ్ గోయల్ అన్నారు. ఈ సంఘటన మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగిందని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, కేతన్ హత్య కేసులో సియా, ఆమె లవర్ చేతన్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. నిందితుల ఇద్దరి మొబైళ్లలో సీక్రెట్ కోడ్ వర్డ్స్‌తో మాట్లాడుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, సియా తన స్నేహితురాలితో చేసిన స్నాప్ చాట్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందులో ‘‘పెళ్లి జరిగేది లేదు’’ అని ఆమె తన స్నేహితురాలితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మెసేజ్‌పై పోలీసులు దృష్టిసారించారు.