Drugs: తమిళనాడు రాష్ట్రంలోని చైన్నెలో మాదక ద్రవ్యాల తరలింపును నియంత్రించేందుకు, డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు రెండు నెలల క్రితం నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. డ్రగ్స్ డీలర్లపై నిఘా పెట్టిన పోలీసులు ఈ సంచలన విషయాన్ని గుర్తించారు. డ్రగ్స్ కిక్ ఎక్కలేదని స్టూడెంట్స్ సొంతంగా తయారు చేసుకున్నారు. మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. చెన్నై సౌగర్ పేటలో ఇంటినే ల్యాబ్ గా మార్చి యూట్యూబ్ సహా పలు వెబ్ సైట్స్ లోని సమాచారంతో కెమిస్ట్రీ స్టూడెంట్స్ తో కలసి మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను సదు స్టూడెంట్స్ తయారీ చేశారు.
Read Also: KA : కిరణ్ అబ్బవరం ‘క’ ట్రైలర్ నేడే రిలీజ్
ఇక, బయట కొనుగోలు చేసిన డ్రగ్స్ నాణ్యతగా లేకపోవడంతో.. కిక్ రాకపోవడంతో డ్రగ్స్ ఇంట్లోనే ఈ విద్యార్థులు తయారు చేసుకున్నారు. ఆ తరువాత ఈజీ మనీ, జల్సాల కోసం డబ్బుల కోసం డ్రగ్స్ డీలర్‌లుగా మారారు. చదువుతున్న కాలేజ్ లోనే దుకాణం తెరిచినా వైనం. పది లక్షల విలువ చేసే డ్రగ్స్, కారు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో ఇంట్లోనే లేబొరేటరీతో డ్రగ్స్ తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. కెమిస్ట్రీ స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పడంతో ఇంట్లో వాళ్లు కూడా గుర్తించలేదని పేర్కొన్నారు.