Site icon NTV Telugu

Tamil Nadu: రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి

Tamil Nadu

Tamil Nadu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడయనల్లూరు దగ్గర రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Hyderabad: అమెరికా వీసా రద్దు.. ఏపీ వైద్యురాలు ఆత్మహత్య

తమిళనాడులోని అచ్చంపట్టి సమీపంలోని తెన్కాసి-మధురై రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. 28 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తెన్కాసిలోని ప్రభుత్వ జిల్లా  ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మస్క్ నిర్వహించిన ‘DOGE’ శాఖ మూసివేత

Exit mobile version